Friday, July 18, 2025

గుడ్ న్యూస్.. బిహార్ ప్రజలకు 125 యూనిట్ల వరకు ఉచిత కరెంట్

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఎన్నికల నేపథ్యలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో పథకాన్ని ప్రకటించారు. గురువారం (జూలై 17) రాష్ట్ర ప్రజలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. అర్హత కలిగిన గృహాలకు 125 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆగస్టు 1, 2025 నుండి, రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు లభిస్తుంది. జూలై నెల విద్యుత్ బిల్లు నుండే ఈ పథకం కింద ప్రజలు ఉచితంగా విద్యుత్ పొందనున్నారు.

ఈ పథకంపై సిఎం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ప్రభుత్వం సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.  రాబోయే మూడు సంవత్సరాలలో పైకప్పులపై లేదా ప్రజా ప్రాంతాలలో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను నితీష్ కుమార్ వెల్లడించారు. “మేము మొదటి నుంచీ అందరికీ సరసమైన ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025 నుండి, అంటే జూలై బిల్లు నుండే, రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు నిర్ణయించాం. దీని వల్ల రాష్ట్రంలోని మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. రాబోయే మూడు సంవత్సరాలలో, ఈ గృహ వినియోగదారులందరి సమ్మతితో, ప్రయోజనాలను అందించడానికి వారి పైకప్పులపై లేదా సమీపంలోని ప్రజా ప్రదేశాలలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాము” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News