Monday, May 6, 2024

ఇబిసిలకు పదిశాతం రిజర్వేషన్.. బీహార్ ప్రభుత్వం వెల్లడి

- Advertisement -
- Advertisement -

పాట్నా : న్యాయపరమైన సర్వీస్‌ల్లో , రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోని లా కాలేజీలు, యూనివర్శిటీల్లో ఆర్థిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వం లోని జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లు 1951 చట్టం మార్గదర్శకాల్లో సవరణలు తీసుకురాడానికి కేబినెట్ ఆమోదించింది.

దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోని లా కాలేజీలు, యూనివర్శిటీల్లో ఈ రిజర్వేషన్ అమలవుతుందని కేబినెట్ సెక్రటేరియట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎస్ సిద్ధార్ధ వెల్లడించారు. ఈమేరకు పూర్తి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో విడుదల అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 100 వెటర్నరీ ఆస్పత్రులను శిక్షణా కేంద్రాలతో సహా ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. దీనికోసం 17 జిల్లాల్లో రూ. 225 కోట్లు ఖర్చు చేస్తారని వివరించారు. వినియోగదారుల వ్యవహారాల విభాగానికి అదనంగా 30 క్లర్కు ఉద్యోగాలను కల్పించడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News