- Advertisement -
కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసి) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ఎంబిబిఎస్ సీట్లతో కాలేజీకి అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచే కొడంగల్ కాలేజీలో ఎంబిబిఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి, వైద్య విద్య అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు. జిఒ.33ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. స్థానికత విషయంలో సమస్య తీరడంతో ఒకటి రెండు రోజుల్లో మొదటి విడత మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నది. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో 4100కుపైగా ఎంబిబిఎస్ సీట్లు ఉండనున్నాయి.
- Advertisement -