Tuesday, April 30, 2024

కాంగ్రెస్‌తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు కాని, అవగాహన కాని ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఇంటింటి ప్ర చారం నిర్వహిస్తున్న సందర్భంగా ఆ య న మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్, ఎంఐఎం మధ్య అవగాహన కుదిరిందన్న కాంగ్రెస్ నేతల వ్యా ఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఎన్నికల బరిలో తమ పార్టీ ఒంటరిగా పోరాడుతుందని ఓవైసి అన్నారు. మజ్లిస్ పార్టీ ఏ పార్టీ ’బీ’ టీమ్ కాదని ఆయన పునర్ఘాటించారు. ఉత్తరప్రదేశ్‌లో పిడిఎం కూటమిలో భా గస్వామ్యంగా ఉన్నామని పేర్కొన్నా రు.

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయన్న బిజెని నేతల ఆరోపణలను అసదుద్దీన్ ఖండించారు. ఓటరు జాబితాపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని, ఇందులో ఎవరి పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో కొత్త పేర్లను జోడించడం, తొలగించడం, తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం వంటివి ప్రతి ఏడాది ఎన్నికల సంఘం చూసుకుంటుందని గుర్తు చేశారు. బోగస్ ఓట్లు అంటే ఎన్నికల సంఘంతో పాటు పాతబస్తీ ప్రజలను అవమానించడమేనని ఓవైసి అన్నారు. నియోజకవర్గంలో దళిత, వెనుకబడిన వర్గాలు, మైనారిటీ ము స్లింలు, క్రైస్తవ ఓటర్లు ఉన్నారని, వారి ఓట్లతోనే తాము గెలుస్తున్నామన్నారు.

తమిళనాడులో ఎఐఎడిఎంకెకు మద్దతు
లోకసభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఎఐఎడిఎంకెకు ఎంఐఎం మద్దతు పరకటించింది. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎఐఎడిఎంకె బిజెపితో పొత్తుకు నిరాకరించిందని ఆయన తెలిపా రు. భవిష్యత్తులో బిజెపితో పొత్తు పెట్టుకోబోమని ఆ పార్టీ ప్రకటించిందని, సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తామని కూడా ఆ పార్టీ హామీ నిచ్చిందని అసదుద్దీన్ తెలిపారు. అందువల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎఐఎడిఎంకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా తమ పొత్తు కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News