ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి దిగుతుందనే వార్తలను రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు . జాతిని ఉద్ధేశించి ఆదివారం ఆయన ప్రసార సాధనాల ద్వారా ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో ఇప్పటి ఘర్షణల దశలో ఆ దేశంపై అణ్వాయుధాలతో విరుచుకుపడే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఇప్పటివరకూ ఈ విషయం ప్రస్తావనకు రాలేదు. ఇక ముందు కూడా రాదనే భావిస్తున్నట్లు వివరించారు. మరీ అతి అసాధారణ బలప్రయోగానికి దిగకుండానే ఉక్రెయిన్‌ను రష్యా దారికి తీసుకురాగలదు. అణ్వాయుధాల వరకూ తాము వెళ్లాల్సిన అవసరం ఉండదని, , అనవసరం అయిన చోట అతి వ్యవహారం అనుచితం అవుతుందన్నారు. గత నవంబర్‌లో రష్యా అధ్యక్షులు పుతిన్ దేశానికి సంబంధించిన అణ్వాయుధ వాడక కట్టుబాట్లకు తగు సవరణలు చేశారు. దేశాధ్యక్షులదే వీటిపై సర్వం సహాధికారం ఉండేలా నిర్థిష్టమైన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఈ క్రమంలో పుతిన్ క్షణంలో అయినా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల దాడికి పురమాయిస్తారనే విమర్శలు తలెత్తాయి.
ఉక్రెయిన్‌పై అణుబాంబుల అవసరం లేదు: పుతిన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -