Thursday, September 19, 2024

రిటైర్‌మెంట్ ప్రసక్తే లేదు:మాయావతి

- Advertisement -
- Advertisement -

క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోబోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి సోమవారం విస్పష్టంగా ప్రకటించారు. ‘అటువంటి నకిలీ వార్తలను కులతత్వ మీడియా ప్రచారం చేస్తున్నది’ అని ఆమె ఆరోపించారు. 68 ఏళ్ల మాయావతి ఉత్తర ప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ‘డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్, కాన్షీరామ్‌జీ వంటి అంబేద్కరైట్ బహుజనుల సమాజాన్ని బలహీనపరిచేందుకు ప్రత్యర్థుల కుట్రలను భగ్నం చేసేందుకు నా చివరి క్షణం వరకు ఆత్మగౌరవానికి, బిఎస్‌పి ప్రతిష్ఠాత్మకు ఉద్యమానికి నిబద్ధమై ఉండాలన్న నా నిర్ణయంలో మార్పు లేదు’ అని మాయావతి ‘ఎక్స్’ పోస్ట్‌లో స్పష్టం చేశారు.

‘అంటే క్రియాశీల రాజకీయాల నుంచి నా రిటైర్‌మెంట్ ప్రశ్నే లేదన్న మాట. నా పరోక్షంలో లేదా అనారోగ్య పరిస్థితుల్లో బిఎస్‌పి వారసునిగా ఆకాశ్ ఆనంద్ పేరును పార్టీ ప్రతిపాదించినప్పటి నుంచి కులతత్వ మీడియా అటువంటి బోగస్ వార్తలను ప్రచారం చేస్తున్నది. జనం జాగ్రత్తగా ఉండాలి’ అని మాయావతి హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘నన్ను రాష్ట్రపతిని చేయనున్నారంటూ గతంలో కూడా వదంతులు వ్యాప్తి చేశారు. కాన్షీరామ్‌జీ అటువంటి ఆఫర్‌ను తిరస్కరించి, రాష్ట్రపతి కావడం అంటే క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడమే అయినందున పార్టీ ప్రయోజనాల రీత్యా అది తనకు అంగీకారయోగ్యం కాదన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన శిష్యురాలినైన తాను దానిని ఎలా అంగీకరించగలను?’ అని మాయావతి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News