Sunday, April 28, 2024

ముకేశ్ అంబానీ బాటలో వారసులు

- Advertisement -
- Advertisement -

ఎలాంటి జీతం తీసుకోరు, బోర్డు సమావేశాలకు వెళ్తేనే ఫీజు
బోర్డు సభ్యులుగా ఆమోదం ప్రతిపాదనలో పేర్కొన్న రిలయన్స్

ముంబై : ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వరుసగా మూడు సంవత్సరాలుగా ఎటువంటి జీతం తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆయన వారసులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్టు సమాచారం. అంబానీ కుటుంబానికి చెందిన ముగ్గురు వారసులు అయిన ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీలు బోర్డు సభ్యులుగా ఎలాంటి జీతం తీసుకోవడం లేదని తెలుస్తోంది.

బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, కమిటీల సమావేశాలకు హాజరైనందుకు మాత్రమే వారికి ఫీజు చెల్లించనున్నారు. ఈ ముగ్గురి నియామకంపై వాటాదారుల ఆమోదం కోసం సమర్పించిన ప్రతిపాదనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సమాచారం ఇచ్చింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలాంటి జీతం తీసుకోకపోవడం లేదనే విషయం తెలిసిందే. అంబానీ పిల్లలు ముగ్గురి నియామకాలపై ఆమోదం కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు తన వాటాదారులకు పోస్ట్ ద్వారా లేఖ పంపింది. కొత్త డైరెక్టర్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా కమిటీల సమావేశాలకు హాజరైనందుకు ఫీజుగా చెల్లించనున్నట్టు ఈ నోటీసులో పేర్కొన్నారు.

ఇటీవల ఆగస్టు 28న ముకేశ్ అంబానీ తన వారసులు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలను రిలయన్స్ వార్షిక ఎజిఎంలో డైరెక్టర్ల బోర్డులో చేర్చుకున్నారు. రిలయన్స్ టెలికాం బిజినెస్ జియోకి ఆకాష్ అంబానీ నేతృత్వం వహిస్తున్నారు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వ్యాపారం, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బాధ్యతలు తీసుకుంటున్నారు. వీరి సోదరుడు అనంత్ అంబానీకి రిలయన్స్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వ్యాపారం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News