Monday, October 14, 2024

ఈ ఏడు నోబెల్ ప్రైజ్‌మనీ పెంపుదల

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం : వివిధ రంగాల్లో నోబెల్ గ్రహీతలకు ఇచ్చే పారితోషిక మొత్తాన్ని ఈ ఏడాది సంబంధిత కమిటీ పెంచుతోంది. ఈ విషయాన్ని నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం అధికారికంగా తెలిపింది. ఈసారి తమ స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నోబెల్ ప్రైజ్ మొత్తం ఈసారి 1 మిలియన్ క్రోనోర్ అంటే 986,270 అమెరికన్ డాలర్లుగా ఖరారు చేసినట్లు తెలిపారు. విజేతలకు ఆర్థికంగా వెసులుబాటు క్రమంలో ఈ పెంపుదల చేసినట్లు వివరించారు.

త్వరితగతిన తమ కరెన్సీ విలువ పడిపోతూ ఉండటంతో యూరో, అమెరికా డాలర్లతో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరిందని తెలిపారు.1901లో నోబెల్ తొలి అవార్డుల బహుకరణ సమయంలో ప్రైజ్ మొత్తం విలువ కేటగిరికి 1,50780 క్రోనోర్స్ గా ఉంది. 2020 ప్రైజ్ సమయంలో ఇది 10 మిలియన్ల స్థాయికి చేరుకుంది. కాగా ఈ ఏడాది నోబెల్ పురస్కారాల విజేతలను వివిధ రంగాలకు సంబంధించి వరుసగా అక్టోబర్ తొలి వారం నుంచి ప్రకటిస్తారు. డిసెంబర్ 10న పురస్కార ప్రదానం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News