Monday, November 11, 2024

కొరియా సరిహద్దులో రోడ్లను పేల్చివేసిన ఉత్తర కొరియా

- Advertisement -
- Advertisement -

దక్షిణ కొరియాతో ఒకప్పుడు అనుసంధానించిన, ప్రస్తుతం వాడకంలో లేని రోడ్లను ఉత్తర ప్రాంతంలో ఉత్తర కొరియా మంగళవారం పేల్చివేసింది. తమ ప్రత్యర్థి డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్‌యాంగ్ మీదుగా విహరించాయని ఉత్తర కొరియా ఆరోపించిన కొన్ని రోజుల తరువాత రెండు కొరియాలు పరస్పరం బెదరింపులు చేసుకుంటున్నాయి. దక్షిణ కొరియా సంప్రదాయవాద ప్రభుత్వంపై ఉత్తర కొరియాకు పెరుగుతున్న ఆగ్రహాన్ని ఆ రోడ్ల విధ్వంసం సుస్పష్టం చేస్తున్నది. దక్షిణ కొరియాతో సంబంధాలు తెంచుకుంటామని, శాంతియుత కొరియా ఏకీకరణ సాధన లక్షాన్ని విడనాడతామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ శపథం చేశారు.

మరింత బలమైన యునైటెడ్ స్టేట్స్ (యుఎస్), దక్షిణ కొరియా దళాలు భారీ ఎత్తున ప్రతీకారచర్యలకు దిగడం దాదాపు ఖాయం కాగా, అది ప్యాంగ్‌యాంగ్ మనుగడకు ముప్పు కాగలదనే భయం కారణంగా కిమ్ దక్షిణ కొరియాపై ముందస్తుగా పెద్ద ఎత్తున దాడి ప్రారంభించే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఉత్తర ప్రాంతంలో రోడ్ల పేల్చివేతలకు స్పందనగా తమ మిలిటరీ సరిహద్దు దక్షిణ ప్రాంతం లోపల కాల్పులు జరిపాయని, అవి తమ సంసిద్ధతను, నిఘాను పటిష్ఠం చేశాయని దక్షిణ కొరియా సైన్యం సంయుక్త దళాధిపతి తెలియజేశారు. ఆ ప్రకటనలో వివరాలు లేవు. కానీ అది ఉత్తర కొరియా నుంచి సీమాంతర కాల్పులను నివారించే యత్నం కావచ్చు. మరి ఉత్తర కొరియా స్పందించిందా లేదా అన్నది వెంటనే తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News