Friday, April 26, 2024

విద్యుత్ శాఖలో 1201 కొలువులకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for 1201 job in the power sector

జూనియర్ లైన్‌మన్,
సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల నియామక ప్ర క్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో, గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల నియామకాలకు ప్రక్రియ ప్రారంభమయ్యింది. టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో 70 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా, మరో 1201 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1,000 ఉండగా, సబ్ ఇంజనీర్ పోస్టులు 201 ఉ న్నాయి. వీటి దరఖాస్తులు ఈనెల 19వ తేదీన, వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నా యి. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపే ట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మ ల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

జూనియర్ లైన్‌మన్‌కు దరఖాస్తులు

జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నెల 19వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా, జూలై 17వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు.

మొత్తం పోస్టులు: 1000

లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 553, జనరల్ రిక్రూట్‌మెంట్ 447 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఐటిఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్‌మెన్ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసవ్వాలి. 2022, జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120.ఎస్సీ,ఎస్టీ, బిసి, పిహెచ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులు ప్రారంభం: మే 19వ తేదీ కాగా దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8వ తేదీ అని అధికారులు తెలిపారు.

హాల్‌టికెట్‌లు డౌన్‌లోడింగ్ జూన్ 11వ తేదీన, రాతపరీక్ష జూన్ 17వ తేదీన జరుగుతుందని దీనికి సంబంధించి మరిన్ని

వివరాలకు వెబ్‌సైట్‌నుhttp://tssouthernpower. cgg.gov.in/ సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.

సబ్ ఇంజనీర్ పోస్టులకు..

201 సబ్ ఇంజనీర్ పోస్టులకు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం పోస్టులు: 201

ఇందులో లిమిటెట్ రిక్రూట్‌మెంట్ 19, జనరల్ రిక్రూట్‌మెంట్ 182 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లమా గానీ, డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 2022, జనవరి 1 నాటి కి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.200లు, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్, ఈడబ్ల్యూఎస్. అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. దరఖాస్తుల ప్రారంభం జూన్ 15వ తేదీన కాగా, దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 5వ తేదీని అధికారులు నిర్ణయించారు.

హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్: జూలై 23వ తేదీ

రాతపరీక్ష: జూలై31న ఉంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News