Tuesday, April 16, 2024

ప్రభుత్వ పాఠశాలకు ఎన్నారై రమేష్ ఇస్సంపల్లి భూవిరాళం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో విద్యను అందించేందుకు ప్రభుత్వం, కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ‘మన ఊరు మనబడి”. సర్కార్ బడుల బలోపేతమే లక్షంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్‌ని స్ఫూర్తిగా తీసుకొని లండన్‌కు చెందిన ఎన్నారై, బిఆర్‌ఎస్ నాయకుడు రమేష్ బాబు ఇసంపల్లి తన సొంతూరు మంచిర్యాల పట్టణ కేందరలోని హమాలీవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న తన 8 గుంటల విలువైన భూమిని పాఠశాలకు విరాళంగా అందజేశారు.

మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర చలనచిత్ర, టివి, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి దీనికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ని కలిసి అందజేశార. విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డపై చూపిస్తున్న ప్రేమ పట్ల, ఇతటి బృహత్తరమైన కార్యక్రమములో పాలుపంచుకున్నందుకు ఎన్నారై రమేష్‌ను మంత్రి కెటిఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ‘మన ఊరుమన బడి’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇటీవల లండన్‌లో పర్యటించిన కెటిఆర్ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి రావాలని ఎన్నారైలకు ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది తన వంతు సహకారాన్ని అందించానని తెలిపాడు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News