Wednesday, March 22, 2023

సుమపై ఎన్‌టిఆర్ ఆగ్రహం…

- Advertisement -

హైదరాబాద్: కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్‌టిఆర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. సుమ యాంకరింగ్ చేస్తూ… ఎన్‌టిఆర్ గురించి మాట్లాడారు. పర్సనల్ లైఫ్ గురించి కానీ ఫ్యామిలీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడరు కానీ ఎన్‌టిఆర్@30 ఎప్పుడు అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఎన్‌టిఆర్ ప్రసంగిస్తారని సుమ చెప్పారు. దీంతో ఎన్‌టిఆర్ మైక్ తీసుకుంటూ సుమ వైపు ఆగ్రహంగా చూశారు. అభిమానులు అడగకపోయినా సుమే చేప్పేసేలా ఉందని కోపంగా చూశారు. వెంటనే కళ్యాణ్ రామ్ కలగ జేసుకొని ఎన్‌టిఆర్‌ను శాంత పరచడానికి ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఉండే భార్య కంటే ముందుగా అభిమానులతోనే కొత్త సినిమాల గురించి చెబుతానని ఎన్‌టిఆర్  వివరణ ఇచ్చాడు. ఎన్‌టిఆర్@30 ఈ నెలలో మొదలు పెడుతామని పేర్కొన్నారు. మార్చ్‌లో షూటింగ్ ప్రారంభించి 2024 ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తానని చెప్పారు. తాము చేసే సినిమాలకు ఎన్ని అవార్డులు వచ్చిన అభిమానుల గొప్పతనం అని పేర్కొన్నారు. సుమ చేసిన వ్యాఖ్యలపై ఎన్‌టిఆర్ అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News