Friday, March 29, 2024

క్యుయెట్‌ స్కోర్స్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్న నిట్‌ యూనివర్శిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో ముందున్న నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు), క్యుయెట్‌ స్కోర్స్‌ (CUET)ను గుర్తించడంతో పాటుగా క్యుయెట్‌ స్కోర్స్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. విద్యార్ధులు తమ క్యుయెట్‌ స్కోర్‌కార్డ్‌ అప్‌లోడ్‌ చేయడంతో పాటుగా తమ అర్హత ఆధారంగా స్కాలర్‌షిప్‌ను పొందవచ్చు. దేశంలో క్యుయెట్‌ స్కోర్‌ను గుర్తించిన 18 ప్రైవేట్‌యూనివర్శిటీలలో ఎన్‌యు ఒకటి. ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి సీఎస్‌ఈ, ఈసీఈ, డీఎస్‌,సీఎస్‌, బీటీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీలో ఇంజినీరింగ్‌తో పాటుగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, బయాలజీ లాంటి బోధనాంశాలలో ఏవైనా రెండింటిలో అత్యుత్తమ స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. బీబీఏ, ఐఎంబీఏ కోసం ఇంగ్లీష్‌, జనరల్‌ టెస్ట్‌, మ్యాథ్‌ లలో మంచి మార్కులు సాధించాలి.

విద్యార్థులు 50వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకూ ట్యూషన్‌ ఫీజు రాయితీ పొందవచ్చు. మెరుగైన అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజులో పూర్తి రాయితీ లభిస్తుంది. నిట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా పలు బోర్డుల వ్యాప్తంగా విద్యార్థులకు సమానమైన అవకాశాలను అందించే దిశగా వేసిన సానుకూలమైన ముందడుగు క్యూట్‌ అని మేము నమ్ముతున్నాము. క్యూట్‌లో చక్కగా స్కోర్‌ చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాము’’ అని అన్నారు. అడ్మిషన్స్‌, ప్లేస్‌మెంట్స్‌ గురించిన మరింత సమాచారం కోసం https://admission2022.niituniversity.in/brand/#applynowచూడండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News