Saturday, August 23, 2025

ఆ వార్తల్లో నిజం లేదు..

- Advertisement -
- Advertisement -

కెప్టెన్సీ మార్పు కథనాలను ఖండించిన బిసిసిఐ

ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించేందుకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రణాళికలు రచిస్తుందని జాతీయ, సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథనాలను బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. వన్డే కెప్టెన్సీ మార్పు విషయం లో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశా రు. ఈ విషయంలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడని, అతని స్థానంలో వేరే ఆటగాడిని నియమించే ఆలోచన బిసిసిఐకి లేదని వివరించారు.

కొంత మంది కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వన్డేల్లో రోహిత్ శర్మ ప్రస్తుతం సారథిగా ఉన్నాడని, అతన్ని మా ర్చేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సైకియా అన్నారు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లలో అపార నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని సైకియా గుర్తు చేశా రు. అంత మాత్రాన వారినే వన్డేల్లో కెప్టెన్‌గా నియమిస్తారని ఎలా భావిస్తారని ప్రశ్నించారు. కెప్టెన్ మార్పు విషయం చాలా క్లిష్టమైన అంశమన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాతే ఏ ఫార్మాట్‌కైనా సారథిని నియమించడం జరుగుతుందన్నారు. రానున్న వరల్డ్‌కప్ వరకు రోహిత్ శర్మను వన్డే సారథిగా కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సైకియా పరోక్షంగా వెల్లడించారు.

ఉత్కంఠతకు తెర..

బిసిసిఐ కార్యదర్శి సైకియా ప్రకటనతో వన్డేల్లో కెప్టెన్సీ మార్పు అంశానికి తెరపడినట్టేనని చెప్పాలి. రోహిత్ శర్మను తప్పించి శ్రేయ స్ అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తా యి. దీంతో రోహిత్ అభిమానుల్లో ఓ విధం గా ఆందోళన మొదలైంది. ప్రధాన కోచ్ గౌ తం గంభీర్ తీరు విసిగిపోయిన రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగిస్తున్నారని, దీని కోసం ప్రధాన కోచ్ గంభీర్ బిసిసిఐపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కథనాలు వినిపించాయి. దీంతో రోహిత్ శర్మ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే బిసిసిఐ కార్యదర్శి సైకి యా ప్రకటతో ఈ ఊహాగానాలకు తెరపడిం ది. మరికొంత కాలం పాటు రోహిత్ వన్డే సా రథిగా కొనసాగడం ఖాయం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News