Tuesday, December 10, 2024

వెస్టిండీస్‌కు వన్డే సిరీస్

- Advertisement -
- Advertisement -

బార్బడోస్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలి ప్ సాల్ట్ (74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సామ్ కరన్ (40), మౌస్లి (57), ఓవర్టన్ (32), జోఫ్రా ఆర్చర్ 38 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ బ్రాండన్ కింగ్, కిసీ కార్టిలు సెంచరీలతో జట్టును గెలిపించారు. కింగ్ 117 బంతు ల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 102 పరుగులు చేశాడు. ఇక ధాటిగా ఆడిన కార్టి 114 బంతుల్లోనే 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 128 పరుగులు సాధించాడు. దీంతో విండీస్ అలవోక విజయంతో సిరీస్ దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News