Monday, April 29, 2024

చంద్రునిపై దింపిన తొలి వాణిజ్య రోదసి నౌక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఒక ప్రైవేట్ అమెరికన్ సంస్థ చంద్రునిపై తొలి వాణిజ్య రోదసి నౌక దింపడం ద్వారా చరిత్ర సృష్టించింది. 50 ఏళ్ల తరువాత భూమి ఏకైక సహజ ఉపగ్రహంపై దిగిన యుఎస్ తొలి రోదసి నౌక కూడా అదే. ఈ క్రమంలో భారత్, రష్యా, యుఎస్, చైనా సరసన చేరింది ఆ సంస్థ. ఇంట్యూటివ్ మెషీన్స్ నిర్మించిన ల్యాండర్ ‘ఒడిస్సిస్’ గురువారం రాత్రి 6.23 (ఇటి) గంటలకు చంద్రునిపై దిగింది. 1972లో అపోలో 17 తరువాత చంద్రునిపై దిగిన తొలి అమెరికన్ రోదసి నౌక అయింది. ‘ఈనాడు అర్ధ శతాబ్దంలో ప్రప్రథమంగా అమెరికా చంద్రునిపైకి మళ్లీ వెళ్లింది’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ప్రకటించారు. హూస్టన్ కేంద్రంగా గల ఇంట్యూటివ్ మెషీన్స్ తన ఒడిస్సిస్ రోబోఉ చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో దింపిన తరువాత నెల్సన్ ఆ ప్రకటన చేశారు.

ల్యాండర్ పలు నాసా శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్లిందని నెల్సన్ తెలిపారు. ‘మా పరికరాలు చంద్రుని ఉపరితలంపై ఉన్నాయని, మేము సందేశం పంపుతున్నామని నిస్సందేహంగా మేము ధ్రువీకరించగలం’ అని ఫ్లైట్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టిమ్ క్రెయిన్ తన సహచరులు, ఇతరుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. అయితే, ఒడిస్సిస్ చంద్రునిపై దిగడానికి కొన్ని క్షణాల ముందు ఉద్విగ్నత నెలకొన్నది. రోదసి నౌక చంద్రునిపై దిగడానికి సన్నద్ధం అవుతుండా, మిషన్ కంట్రోలర్లకు దానితో సంబంధాలు తెగిపోయాయని ఎన్‌బిసి న్యూస్ తెలిపింది. ‘పరిస్థితిని సర్దుబాటు చేసిన తరువాత ఒడిస్సిస్ నిలదొక్కుకుందని, డేటాను పంపసాగిందని, చంద్రుని ఉపరితలం నుంచి తొలి చిత్రాలను డౌన్‌లింక్ చేస్తున్నామని ఇంట్యూటివ్ మెషీన్స్ సిఇఒ స్టీఫెన్ అల్టెమస్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News