Monday, April 28, 2025

ప్రధానిపై వ్యతిరేకత.. మరోసారి అల్లర్లు..!

- Advertisement -
- Advertisement -

ఢాకా: గత ఏడాది బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలసిందే. అయితే తాజాగా బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత మహమద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే మహమద్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడి ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ఐదురురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్లు, ఇతర ముఖ్య అధికారులు ఈ సమావే:లో పాల్గొన్నారు. ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందని రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News