Friday, March 29, 2024

2100 నాటికి జీవవైవిధ్యంలో నాలుగోవంతు వినాశనం

- Advertisement -
- Advertisement -

2100 నాటికి ప్రపంచం లోని జీవవైవిధ్యంలో నాలుగోవంతు కన్నా ఎక్కువగా అంతరించిపోయే వినాశాన్ని భూగోళం ఎదుర్కొంటుందని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులతో ప్రపంచంలో ఎలాంటి వినాశనాలు సంభవిస్తాయో అంచనా వేయడానికి ఆస్ట్రేలియా, ఐరోపా శాస్త్రవేత్తలు వర్చువల్ ఎర్త్‌ను అభివృద్ధి చేశారు. దీంతో వచ్చిన బట్టి 2050 నాటికి అన్ని మొక్కలు, మృగాల జాతులు పది శాతం వరకు , ఈ శతాబ్దం అంతానికి 27 శాతం వరకు నాశనమైపోతాయని వెల్లడైంది. మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పులు కారణంగా ఈభూగోళం ఇప్పటికే ఆరో అంతిమ దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ సమాజం రెడ్ లిస్టు ప్రకారం 42,100 వన్య, వృక్ష జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయని స్పష్టమౌతోంది. ఇప్పుడు పుట్టిన పిల్లలు 70 ఏళ్లవారైతే వేల కొలది వృక్ష, మృగ జాతులు అంతరించిపోడవాన్ని ప్రత్యక్షంగా చూస్తారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చిన్నచిన్నతోటలు, సూక్ష్మ కీటకాలు, నుంచి ఏనుగులు వంటి భారీ మృగాలు కూడా నాశనమౌతాయని చెబుతున్నారు. సూపర్ కంప్యూటర్ ఉపయోగించి, పరస్పర అనుసంధానిత తెగల భవిష్యత్తును అంచనా వేయడానికి 15,000 ఫుడ్ వెబ్స్‌తో ఒక ప్రపంచాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు.

భూమిపై ఎక్కడైనా వినాశనం ఎలా జరుగుతుందో ఈ సాధనం అంచనా వేస్తుందని చెప్పారు. అలాగే ప్రపంచం లోని జీవవైవిధ్య భయంకర భవిష్యత్తును అంచనా వేస్తుందని చెప్పారు. నిస్పందేహంగా ప్రపంచం ఆరో వినాశన దశకు చేరుకుంటోందని పేర్కొన్నారు. రానున్న శతాబ్దంలో వినాశన దశలను అంచనా వేయడంలో ఇదివరకటి అధ్యయనాలు విఫలమయ్యాయని, అంతర్గతంగా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న సహ వినాశనాలను అవి అధ్యయనంలో పొందుపర్చలేకపోవడమే దీనికి కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News