Sunday, September 15, 2024

మణికొండలో కొనసాగుతున్న కూల్చివేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నార్సింగి: గండిపేట మండలంలోని మణికొండ మున్సిపాలిటీలోని నెక్నంపూర్, పాషాకాలనీలో గురువారం మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అ క్రమ నిర్మాణాలను కూల్చివేసారు. గురువారం ఉదయం నుండి ప్రారంభమైన కూల్చివేతలు సాయంత్రం వరకు పలు బహూళ అంతస్తుల భవనాలను కూల్చివేసారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అనుమతులకు వి రుద్ధంగా నిర్మించిన భవనాలను ఎట్టి పరిస్థితుల లో కూల్చివేయటం జరుగుతుందన్నారు.

గతంలో జి ప్లస్ వన్ అనుమతులు తీసుకుని సరాసరి ఐదు, ఆరు, ఏడు అంతస్తుల భవనాలు అక్రమం గా నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే అటువంటి అక్రమ నిర్మాణాలను తాము గుర్తించటం జరిగిందని వాటిపై కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ కూల్చివేతలలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News