- Advertisement -
హైదరాబాద్: నగరంలో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. స్థానికులకు ధర గుదిబండలా తయారయింది. గత నెల కిలో ఉల్లి గడ్డల ధర రూ. 25 నుంచి రూ. 30 మధ్య ధర పలకగా నేడది రూ. 70 ధర పలుకుతోంది. ఉల్లిగడ్డల ధరల ఇంతలా పెరగడంతో వినియోగదారులు కొనడానికి వెనుకాడుతున్నారు.
తెలంగాణ రైతు బజారులో ఉల్లిగడ్డల ధర కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతుండగా, స్థానిక స్టోర్లలో కిలో రూ. 70 ధర పలుకుతోంది. ప్రస్తుతం నగరవాసులకు ఉల్లి ధర ప్రియం అయిపోయిందనే చెప్పాలి. ఉల్లి ధర పెరగడంతో అమ్మకాల పరిమాణం తగ్గిపోయిందనే చెప్పాలి. తెలంగాణ, దాని ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో విపరీతంగా కురిసిన వానల వల్ల పంట నష్టం తీవ్రంగా ఉంది. తత్పలితంగా ఉల్లి ధరలు పెరిగాయని అంటున్నారు.
- Advertisement -