Tuesday, September 16, 2025

ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ హత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు దారుణం చోటుచేసుకుంది. ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. అతడి వద్ద ఉన్న సబ్ స్టేషన్ ఫోన్, పర్సనల్ ఫోన్లు తీసుకెళ్లారు. హర్యా ది శంకర్ పల్లి మండలం మోకీల గ్రామం. రెండు సంవత్సరాలు గా ఆలూరులో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News