Saturday, September 30, 2023

ప్రతిపక్షాలకు అభివృద్ధి పట్టదు..అధికారమే వారికి పరమావధి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రతిపక్షాలకు అభివృద్ధి అవసరం లేదని, వారి స్వార్థమంతా అధికారమే పరమావధిగా ప్రజలను మభ్య పెడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 రూపాయల భోజనం మర్రి అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మర్రి జ నార్ధన్ రెడ్డి, ట్రస్ట్ డైరెక్టర్స్ మర్రి జుమన రాణి, జ క్కా రఘునందన్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించా రు.

పేదల ఆకలి తీర్చడానికి రూ. 5కే మధ్యాహ్న భోజనం అందించడానికి మర్రి అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు ఎంజెఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ సాగునీటి రంగంపై, సంక్షేమంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించి పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు రైతును రాజును చేసే పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. రైతు బంధు, రైతుభీమా, రైతుకు ఉచిత విద్యుత్, సకాలంలో రైతుకు ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించడం, రైతులకు సబ్సిడిపై పనిముట్లు అందించడం వంటి బృహత్తర పథకాలకు కెసిఆర్ శ్రీకారం చుట్టడం వల్లే నేడు వ్యవసా య రంగం తెలంగాణలో దేశంలోనే మొదటి స్థాన ంలో నిలిచిందన్నారు.

ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఎప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ప్రజలను ఎలా మభ్య పెట్టాలి అన్నదే వారి లక్షమన్నారు. నాడు అంబలి కేంద్రాలకు పరిమితమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అందులో కరువు కాటకాలతో నాగర్‌కర్నూల్ ప్రాంతం ప్రజలు అల్లాడిన రోజులు చూశామన్నారు. నేడు ఒక్కొక్క రంగాన్ని బలోపేతం చేస్తూ దేశంలోనే తెలంగాణను మాడల్‌గా నిలిపిన ఘనత కెసిఆర్‌కు దక్కిందన్నారు. అ ంబలి కేంద్రాలు ఉన్నచోట నాడు బిర్యాని పాయింట్లతో రైతును కూడా ఆర్థికంగా ఎదిగి తెలంగాణ అన్నపూర్ణగా మారిందంటే అది కెసిఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

65 ఏళ్లలో ఇంత అభివృద్ది ఎందుకు చేయలేదని ఆయన ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. నేడు రకరకాల జెండా లు పెట్టుకుని ప్రజలు ముందుకు వస్తున్న వారు గతంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. కెసిఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ రాష్ట్రం ఐటి, పారిశ్రామికంగా ఉద్యోగ కల్పనలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయమన్నారు. మోసపో తే గోస పడతారని, వారు ఓట్లు వేసుకున్న తర్వాత మీ గురించి పట్టించుకోరన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న పేదలు, వృద్ధులకు, తినడానికి డబ్బులు లేక అర్థాకలితో ఉ న్న వారి ఆకలి తీర్చడానికి తన ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మర్రన్న క్యాంటీన్ ఏర్పా టు చేశామన్నారు. రూ. 5 రూపాయలకే మధ్యా హ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. రోజు కు 500 నుంచి వెయ్యి మంది ఆకలి తీర్చే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో వంట అయ్యే విధంగా అత్యాధునిక కిచెన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు అన్నం, కూర, చట్ని, సాంబార్, పెరుగు అందజేయనున్నట్లు తెలిపారు.

ఇవే కాకుండా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. సామూహిక వివాహాలతో సుమారు 800 మంది నిరుపేద ఆడబిడ్డలకు పెళ్ళిళ్లు చేశామన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు తమ ట్ర స్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చే శామన్నారు. గత కొన్ని రోజుల కింద నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతి యువకులకు ఉచితంగా ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామాన్నట్లు తె లిపారు.

రాబోయే కాలంలో కూడా తమ ట్రస్టు ఆ ధ్వర్యంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్, ట్రస్ట్ డైరెక్టర్‌లు జక్కా రఘునందన్ రెడ్డి, డైరెక్టర్ మర్రి జమున రాణి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ హనుమంత రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన, వైస్ చైర్మెన్ బాబు రావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగనమోని కురుమయ్యలతో పాటు నియోజకవర్గంలోని జెడ్పిటిసిలు, ఎంపిపిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News