Sunday, April 28, 2024

ప్రతిపక్షాల పాట్నా సమావేశం ముగింపు..తదుపరి సమావేశం సిమ్లాలో

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ సమైక్యం చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐక్యతా సమావేశంసాయంత్రానికి ముగిసింది. తదుపరి సమావేశం సిమ్లాలో నిర్వహించాలని నేటి సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అధ్యక్షతన నేటి సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు నేటి సమావేశానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News