Friday, April 26, 2024

ఇ-వ్యర్థాల సేకరణను చేపట్టిన ఆర్చిడ్స్ అంతర్జాతీయ పాఠశాల..

- Advertisement -
- Advertisement -

ఇండియాలో అగ్రగామి అంతర్జాతీయ కె12 స్కూల్ చైన్‌ల‌లో ఒకటిగా ఉన్న ఆర్చిడ్స్-అంతర్జాతీయ పాఠశాల (OIS), తన పాఠశాలల వ్యాప్తంగా ఇ-వ్యర్థాల సేకరణ ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ఇ-వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ, ఇ-వ్యర్థాల ఉత్పత్తులను గుర్తించడంలో విద్యార్థులు ఎలా పాత్ర పోషించగలరు.. వ్యర్థాలను వేరుపరచు ప్రక్రియ, పారవేతను అర్థం చేసుకోవడం ద్వారా ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ ప్రక్రియ దిశగా ఎలా దోహదపడగలరో దాని గురించి వారికి తగిన అవగాహన కల్పించడానికి గాను స్కూల్ చైన్ Z ఎన్విరో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో భాగస్వామ్యం కుదుర్చుకొంది.

విద్యార్థులకు అత్యుత్తమ రీసైక్లింగ్ అలవాట్లను నేర్పించాలనే లక్ష్యముతో, OIS తన పాఠశాలలు అన్నింటి వ్యాప్తంగా అన్ని గ్రేడుల విద్యార్థుల నుండి ఇ-వ్యర్థాలను సేకరిస్తుంది. ఇ-వ్యర్థాల వస్తువులలో ఈ క్రిందివి చేరి ఉంటాయి: పాతవి లేదా పగిలిపోయిన ల్యాప్‌టాప్‌లు, PC, ట్యాబ్‌లు, మౌస్, స్పీకర్లు, బ్యాటరీలు, పవ ఈ వస్తువులను ఆ తర్వాత ఆ నగరం లోని సంబంధిత భాగస్వామ్య రీసైక్లింగ్ సంస్థకు పంపించడం జరుగుతుంది. స్కూల్ చైన్ గడచిన ఒక్క నెలలో 4 నగరాలు – ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌ల నుండి సుమారుగా 500 కిలోల ఇ-వ్యర్థాల ఉత్పత్తులను సేకరించింది. ఈ క్యాంపెయిన్ యందు మొత్తం మీద 35000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ర్ బ్యాంక్‌లు, ఛార్జర్లు, కుక్కర్లు, గ్రైండర్లు, టీవీ, హెడ్ ఫోన్లు, సిడిలు, పాత మొబైల్ ఫోన్లు, అటువంటివే ఇతర వస్తువులు.

ఈ చొరవ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఆర్చిడ్స్ అంతర్జాతీయ పాఠశాల, ప్రజా సంబంధాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగాధిపతి శ్రీమతి సర్వమంగళ కోటి సింఘాల్ ఇలా అన్నారు.. “నేటి పిల్లలు తమ దైనందిన జీవితాలలో అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ వస్తువులు పాతబడిపోయినప్పుడు లేదా పగిలిపోయినప్పుడు, వాటిని పారవేయడం గురించి వారికి తగినంత పరిజ్ఞానముగానీ లేదా ఆ ఏర్పాటు గానీ లేదు. పర్యావరణముపై ఎలక్ట్రానిక్ వ్యర్థాల యొక్క హానిపూరితమైన ప్రభావమును వారు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. అందువల్ల, ఈ ప్రచారోద్యమం ద్వారా, ఆర్చిడ్స్ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు సరియైన ఇ-వ్యర్థాల పారవేత పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశం పొందుతారు. అటువంటి చొరవల ద్వారా అవగాహనను వ్యాప్తి చేయడం వల్ల మా విద్యార్థులు మన పర్యావరణాన్ని పాడు చేసే వస్తువుల వాడకము, పారవేత విషయంగా మరింత ధ్యాస ఉంచుతారని ఆర్చిడ్స్, అంతర్జాతీయ పాఠశాల వద్ద మేము గట్టిగా విశ్వసిస్తాము. ఆ విధంగా వారు రేపటి పర్యావరణ-యోధులుగా పని చేస్తారు” అన్నారు.

ఆర్చిడ్స్ – అంతర్జాతీయ పాఠశాల ఈ ఉద్యమాన్ని 25 కు పైగా ప్రధాన నగరాలలో విస్తరించియున్న 90 శాఖల వ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. సుస్థిరత్వము, ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క సమీకృతమైన ఉద్దేశ్యముగా ఉంది. ఇది, ఒక వలయాకార ఆర్థికస్థితి దిశగా దేశం యొక్క సజావైన పరివర్తనను శీఘ్ర-గతిన ముందుకు తీసుకువెళ్ళేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ (నగరప్రాంతం) 2.0 చే ఏర్పరచబడిన లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News