- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాల్వబుగ్గ ప్రాంతం కాశిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలో ట్రాక్టర్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు షేక్ కమల్ బాషా(50), మున్ని(35), షేక్ నదియా(03)గా గుర్తించారు. ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లాలోని మైదకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -