Wednesday, July 23, 2025

గండిపేటకు నిర్లక్ష్యం ‘గండి’

- Advertisement -
- Advertisement -

జంట జలాశయాలపై అధికారుల అలసత్వం
పరీవాహక ప్రాంతాల్లో మూడురోజులు భారీ వర్షాలు 
అయినా… నీటిమట్టం అడుగు కూడా పెరగని వైనం
కబ్జాలతోనే జలాశయాలకు దయనీయస్థితి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: చారిత్రక జంట జలాశయాలల దయనీయ స్థితిలో పడిపోయాయి. పాలకుల నిర్లక్షం కారణంగా క్రమంగా తమ ఉనికిని కోల్పోతున్నాయి. వందేళ్ల చరిత్ర క లిగి నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాలకు ఉరి బిగుస్తోంది. ఇటు పాలకుల నిర్లక్షం…. అటు రియల్ వ్యాపారుల బరితెగింపు తో జంట జలాశయాలు రోజురోజుకు కుదించుకుపోతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి నగరానికి నీటిని తీసుకువస్తున్న పాలకులు నగరానికి అతిచేరువలో ఉండి ఏమాత్రం ఖర్చులేకుం డా నగరవాసుల గొంతు తడుపుతున్న జలాశయాలపై చూపిస్తున్న చిన్నచూ పు నగరవాసులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పరివాహక ప్రాంతాల్లో కబ్జాల కారణంగా జలాశయాలకు వరదనీరు రాకుండా ఒకవైపు ఉన్ననీటితో ప్రజల గొంతు తడపక మరోవైపు కనబరుస్తు న్న నిర్లక్షంతో జలాశయాల ఉనికి ప్ర శ్నార్థకంగా మారుతుంది. గత మూడు రోజులుగా పరివాహకక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నా…జలాశయా ల్లో అడుగునీటి మట్టం కూడా పెరగకపోవడంఅందరినీ కలచివేస్త్తుంది. జలాశయాల పరివాహక ప్రాంతాలైన శం షాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, షా బాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు

తదితర ప్రాంతాల్లో మూడురోజులు వర్షాలు భారీగా కురియగా, ఉస్మాన్‌సాగర్‌లో అర అడుగు నీటి మట్టం పెరగగా, హిమాయత్‌సాగర్‌లో ఒక అడుగు నీటి మట్టం మాత్రమే పెరగడం విశేషం. వేసవికాలంలో శివారు ప్రాంతాలు నీటికోసం అల్లాడినా పట్టించుకోని జలమండలి అధికారులు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా పట్టనట్టు చేతులెత్తేయడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గండిపేట జలాశయం నీటి సామర్థం 1790 అడుగులు కాగా, ఈనెల 17(గురువారం)న నీటిమట్టం 1782.300 ఉండగా, మంగళవారం(22న)నాటికి 1782.800కు చేరింది. అంటే కేవలం అర అడుగు నీటిమట్టం మాత్రం పెరిగింది. హిమాయత్‌సాగర్ జలాశయం నీటి సామర్థం 1763.500 అడుగులు కాగా, గురువారం నాడు 1758.300 ఉండగా, మంగళవారం నాటికి 1759.200 అడుగులకు పెరిగింది.

అంటే సుమారుగా ఒక అడుగు నీటిమట్టం మాత్రమే పెరిగింది. కొన్ని దశాబ్దాలుగా నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న కనీసం జలాశయాల్లో పూడికతీత పనులను కూడా చేపట్టకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వల కన్నా పూడికనే ఎక్కువగా చేరుకుంది. మరమ్మతులను కూడా చేపట్టకపోవడంతో చారిత్రక ఖ్యాతి మసకబారుతోంది. జలశయాల పరివాహక ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న కబ్జాలతో వరద కాలువలూ భారీగా కుదించుకుపోవడం కనుమరుగు కావడంతో వరదనీరు కూడా రాలేని దుస్థితి నెలకొన్నది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఆక్రమణలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో జలాశయాలు దయనీయంగా మారాయి. బడా రాజకీయనేతలు,అధికారులు జాలశయాలను కుదించి నిర్మాణాలు చేపట్టినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శాపంగా మారుతోంది. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే తగుచర్యలు చేపట్టి జలాశయాలపై ప్రత్యేక శ్రద్ధ్ద కనబరచి కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News