Wednesday, May 15, 2024

హిమాయత్ సాగర్‌కు కొనసాగుతున్న వరద

- Advertisement -
- Advertisement -

రెండు గేట్ల ద్వారా 1340 క్యూసెక్కుల నీటి విడుదల
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండీ దానకిశోర్ సూచన

హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్ల ద్వారా దిగువ మూసీలో వరద జలాలను జలమండలి అధికారులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ రెండు గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 1340 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జలమండలి ఎండీ దానకిశోర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృత్తి పెరిగే మూసీ చుట్టుపక్కల నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు రెవెన్యూ అధికారులు కమ్యూనిటీ సెంటర్లు, స్కూళ్లు, పంక్షన్‌హాల్స్ సిద్దంగా ఉంచాలని, అదే విధంగా పోలీసు అధికారులు వరద వైపు సమీప ప్రాంతాల ప్రజలు వెళ్లకుండా చూడాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద నిల్వ లేకుండా మోటార్ల ద్వారా తోడేయాలని సూచించారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1761.75 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.520 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1340 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News