Friday, June 6, 2025

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘జాట్’ ఒటిటి విడుదల తేదీ ప్రకటన

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ నటుడు బాబా డియోల్ ప్రధాన పాత్రలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘జాట్’ (Jaat Movie). ఏప్రిల్ 10వ తేదీన విడులైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చేశాయి. అయితే ఈ సినిమా ఒటిటి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్ 5వ తేదీన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. హిందీతో పాటు తెలుగులోనూ ‘జాట్’ (Jaat Movie) సినిమాను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా చూడాలన్న తెలుగు ప్రేక్షకుల ఆశ కూడా నెరవేరినట్లైంది. ఇక ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, సయామీ ఖైర్, వినీత్ కుమార్ సింగ్, జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్ ఘోష్ మరియు రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News