Saturday, April 27, 2024

తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Heavy Rains in Telangana for next 3 days

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 72 గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆది, సోమ, మంగళ వారాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ తోసహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతోపాటు గ్రామాల్లోకి భారీగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు.

Heavy Rains in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News