Friday, April 19, 2024

కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపి పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేదని విమర్శించారు. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు నేరుగా గెలవలేక కొన్ని చిన్న పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది కాబట్టే అందరూ టికెట్ కోసం పోటీ పడుతున్నారని అన్నారు. ఎంఎల్‌ఎ టికెట్ల విషయంలో తమ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారికి, గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందని చెప్పారు.

Also Read: ’రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా’: రేవంత్‌రెడ్డి

గవర్నర్‌లు రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ను కర్తవ్యపథ్‌గా పేరు మారుస్తూ బ్రిటీష్ కాలం నాటి పేర్లు ఉండొద్దని అన్నారని, గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటీష్ వారి నుంచి వచ్చిందే కదా అని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెయేతర రాష్ట్రాలలో గవర్నర్లు ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అయితే మేము ఉండాలి…లేదంటే కాంగ్రెస్ ఉండాలి అనే విధంగా కేంద్రంలోని బిజెపి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టాలు చేయాలా…?లేక నామినేటెడ్ అయిన గవర్నర్లు చటాలు చేయాలా..? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థతో రాజకీయం చేసి రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు.

సిబిఐ నమ్మకం లేదని మోడీ అన్న మాటలే మేము అంటున్నాం
సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని కెటిఆర్ గుర్తు చేశారు. సిబిఐ విచారణపై తమకు నమ్మకం లేదని మోడీ అన్న మాటలనే తాము అంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేసే సిట్‌పై నమ్మకం లేదని బిజెపి నాయకులు అంటున్నారని, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ మర్డర్ కేసులో అక్కడి ప్రభుత్వం సిట్ వేయలేదా..? అని ప్రశ్నించారు. యుపి ప్రభుత్వం వేసే సిట్ విచారణ బాగా చేస్తుంది…కానీ తెలంగాణ ప్రభుత్వం వేసే సిట్ సరిగ్గా విచారణ చేయదా..? అని ప్రశ్నించారు. వివిధ కేసులలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ సమర్థవంతంగా విచారణ చేస్తుందని తమకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News