Wednesday, May 8, 2024

పంచ పద్మాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా, అందు లో ఆరుగురిని పద్మ విభూషణ్‌కు, 9 మందిని పద్మభూషణ్‌కు, 91 మంది ని పద్మశ్రీ అవార్డుల కోసం ఎంపిక చేసింది. గత ఏడాది మే 1నుంచి సెప్టెంబర్ 15వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 12 మందికి పద్మ అవార్డులు లభించాయి.

తెలంగాణనుం చి ఆధాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన జీయర్ స్వామి, కమలేశ్ డి. పటేల్ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి. రామకృష్ణారెడ్డి(సాహిత్యం, విద్య) పద్మశ్రీకి ఎంపికయ్యారు. కాగా అంధ్రప్రదేశ్‌నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళలు), గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వర రావు( సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సి వి రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి(ఆర్ట్), సంకురాత్రి చంద్రశేఖర్(సామాజిక సేవ), ప్రకాశ్ చంద్రసూద్(సాహిత్యం, విద్య విభాగం)లను పద్మశ్రీ వరించింది.
పద్మ విభూషణ్ గ్రహీతలు
వీరితో పాటుగా ఓఆర్‌ఎస్( ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త దిలీప్ మహాలనబిస్‌కు వైద్య రంగంలో మరణానంతరం విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది అక్టోబర్‌లో కన్ను మూశారు. ప్రముఖ తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుపేన్(కళలు),కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ (ప్రజా జీవితం), ప్రముఖ ఆర్కిటెక్చర్ బాలకృష్ణ దోషి(మరణానంతరం) , అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీనివాస వర్ధన్ (సైన్స్, టెక్నాలజీ),ఇటీవల కన్ను మూసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (ప్రజాజీవితం)లకు పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి
పద్మభూషణ్ పురస్కారాలు
ఎస్‌ఎల్ బైరప్ప(విద్య, సాహిత్యం), కుమార మంగళం బిరా ్ల(వాణిజ్యం, పరిశ్రమలు),దీపక్ ధార్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం(కళలు), సుమన్ కళ్యాణ్‌పుర్(కళలు),కపిల్ కపూర్( సాహిత్యం, విద్య), ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి (సామాజిక సేవ)లకు పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. ఇక వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 91 మందికి పద్మశ్రీ పురసారాలు లభించాయి. వీరిలో సామాజిక సేవా రంగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన చందర్ దావర్, అండమాన్ నికోబార్‌కు చెందిన రతన్ చంద్రాకర్, గుజరాత్‌కుచెందిన గిరిజన సామాజిక సేవకురాలు హీరాబాయి లోబి,తమిళనాడుకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్స్ వడివేల్‌గోపాల్, మసి సదాయ్యన్, కళా రంగంలో కర్నాటకకు చెందిన రాణి మచ్చయ్య,ముని వెంకటప్ప తదితరులు ఉన్నారు.
గిరిజన భాషల పరిరక్షకునికి పద్మ పురస్కారం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన లింగ్విస్టిక్ ప్రొఫెసర్ బి.రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.లిటరేచర్, ఎడ్యుకేషన్(లింగ్విస్టిక్) విభాగంలో పద్మశ్రీ లభించింది. గిరిజన, దక్షిణాది భాషలకు ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కువి,మందా, కుయ్ వంటి గిరిజన, దక్షిణాది భాషల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారు. గిరిజన భాషలను ఇతర భాషలతో కలుపుతూ సాంస్కృతిక వారధిని నిర్మించేందుకు దశాబ్దాల పాటు శ్రమించారు. మాండా – ఇంగ్లీష్ డిక్షనరీని, కువి ఒరియా ఇంగ్లీష్ డిక్చనరీని రూపొందించారు. మరో ఐదు పుస్తకాలను సహ రచయితగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News