Wednesday, May 8, 2024

పారా అథ్లెట్ దేవేంద్రకు పద్మభూషణ్

- Advertisement -
- Advertisement -

Padma Bhushan to Para Athlete Devendra

నీరజ్, సుమిత్, భగత్‌లకు పద్మశ్రీ

న్యూఢిల్లీ: పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియాకు దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు లభించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, పారా అథ్లెట్లు సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, అవనీ లేఖరా తదితరులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అంతేగాక భారత మహిళా హాకీ క్రీడాకారిని వందన కటారియాకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 128 మందికి ఈసారి పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలకు అవార్డులను బహూకరిస్తారు . ఇక 2022 సంవత్సరానికిగాను క్రీడా రంగంలో మొత్తం 9 మందికి పద్మా అవార్డులు లభించాయి.

దేశంలోనే మూడో అత్యుత్తమ అవార్డుగా భావించే పద్మభూషణ్ అవార్డు పారా అథ్లెట్ దేవేంద్రకు దక్కింది. దేవేంద్ర ఝఝారియా పారాలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. అతను ఒక స్వర్ణం, మరో రజతం సాధించాడు. దీంతో అతని ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను సత్కరించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన యువ సంచలనం, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు పద్మశ్రీ అవార్డు దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ జావెలిన్‌త్రోలో పసిడి సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. చోప్రాతో పాటు సుమిత్, భగత్, శంకర్ నారాయణ్, ఫసల్ అలీ దార్, వందన కటారియా, అవనీ లేఖరా, బ్రహ్మానంద్ సంక్‌వాల్కర్‌లకు కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News