ఢిల్లీ: శ్రీనగర్, ఉధంపూర్ లోని ఆస్పత్రులపై (Hospital) పాకిస్థాన్ (Pakistan) దాడులు చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్-భారత్ సరిహద్దుల కాల్పుల మోత మోగుతుండడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ ఆర్మీ నిరంతరంగా పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేస్తోందని, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌లాంచర్లను ధ్వంసం చేశామని, పాకిస్థాన్ డ్రోన్లు, లాంగ్‌రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో దాడులు చేస్తోందని కల్నల్ వివరించారు.
భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లతో దాడి చేసిందని, అర్థరాత్రి 1.40 గంటల తరువాత పాకిస్థాన్ (Pakistan) దాడులు తీవ్రతరం చేసిందని, శ్రీనగర్, ఉధంపూర్, బటిండా, భుజ్‌లో దాడులకు పాల్పడుతోందని సోఫియా ఖురేషి పేర్కొన్నారు. పలుచోట్లు పాఠశాలలు, వాయుసేన ఆస్పత్రులపై (Hospital) కూడా దాడులు చేస్తోందని, శ్రీనగర్ నుంచి నలియా వరకు పాక్ భారీ దాడులకు పాల్పడుతోందని, భుజ్, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లపై పాక్ దాడి చేసిందని, పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లను పాక్ లక్ష్యంగా చేసుకుందని, పాక్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిగా గుర్తించామన్నారు.