Tuesday, April 30, 2024

పొంగులేటి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

కూసుమంచి ః- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో 56460వేల భారీ మెజారిటీతో గెలుపొందాడు. పొంగులేటి, బిఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి పై మొదటి రౌండ్ మొదలుకొని 21 రౌండ్లు పూర్తయ్యేసరికి 102762 ఓట్లతో ఎవరు ఊహించని రీతిలో ఘన విజయం సాధించారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డికి 56,162 ఓట్లు పోలయ్యాయి. కందాళ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన కందాళ బిఆర్‌ఎస్ లో చేరారు. పొంగులేటి గతంలో వైఏస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా గెలిచారు.

అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని 7సంవత్సరాలు కొనసాగిన పొంగులేటికి ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించలేదు.ఇటివల గులాబీ పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పొంగులేటినీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాగంగా ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి హస్తం గూటికి చేరారు.కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఖమ్మంలో ఏ ఒక్క బీఆర్‌ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గెట్ తాకనివ్వను అని బీఆర్‌ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరారు.చివరకు అన్న మాటను పొంగులేటి నిలబెట్టుకున్నాడు. దింతో పొంగులేటి గెలుపు పట్ల ఆయన అభిమానులు కార్యకర్తలు నాయకులు కూసుమంచి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు.
పాలేరు నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి కి మండలాల వారిగా వచ్చిన ఆధిక్యత (సుమారు)
తిరుమలాయపాలెం 9000
ఖమ్మం రూరల్ 25000
కూసుమంచి 11000
నేలకొండపల్లి 10000
పోస్టల్ బ్యాలెట్లు 1700
మొత్తం 57 వేల ఆధిక్యత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News