Home తాజా వార్తలు ఇక పాలమూరు పరుగులు…

ఇక పాలమూరు పరుగులు…

 lift irrigation project

 

రెండేళ్ళలో ప్రాజెక్టు పూర్తికి ప్రణాళిక
వచ్చే ఏడాది నాటికి మొదటి, రెండవ లిఫ్ట్ వద్ద ఒక్కో మోటర్ ప్రారంభానికి యోచన
ఇప్పటికే ఏదుల రిజర్వాయర్పనులుపూర్తి
పురోగతిలో వట్టెం, నార్లపూర్ రిజర్వాయర్ పనులు
కొనసాగుతున్న టన్నెల్ పనులు
జూలై నెలలో ప్రాజెక్టు పరిశీలనకు సిఎం వచ్చే అవకాశం

నిత్యం కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతూ వలసల, కరువు జిల్లాగా పేరు పొందిన ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్షంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 12 లక్షల ఎకరాలతో సాగునీరు అందించే లక్షంతో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి ఇకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రీకరించనున్నారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని పరిశీలించడానికి ఇంజనీర్లు, అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ జూలై నెలలోనే పర్యటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రెండేళ్ళలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది నాటికి మొదటి, రెండవ లిఫ్ట్ వద్ద ఒక్కో మోటర్‌ను రన్ చేయాలనిలక్షంగాపెట్టుకునట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండవ లిఫ్ట్ వద్ద ఏదుల రిజర్వాయర్ పనులు 95 శాతం పూర్తి అయ్యాయి.

నాగర్‌కర్నూల్ : ఏదుల రిజర్వాయర్‌ను 8 టిఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ భూగర్భంలో మోటర్లను బిగించేందుకు టన్నెల్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఇక్కడ మోటర్లను అమర్చే బేసులను, సర్జిపూల్ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అదే విధ ంగా మొదటి లిఫ్ట్ వద్ద నార్లాపూర్‌లో రిజర్వాయర్ పనులు యుద్దప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. అక్కడ 8 టిఎంసీలు నీటి నిల్వ ఉండే విధ ంగా రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా కృష్ణానది నుంచి అప్రోచ్ ఛానెల్ ద్వారా మొదటి లిఫ్ట్ కు నీటిని అందించే పనులు చేపడుతున్నారు. అదే విధంగా భూగర్భంలోనే మోటర్లను బిగించేందు కు పనులు జరుగుతున్నాయి.

భూ సేకరణ తక్కువగా వినియోగించి ఎక్కువ నీటిని తోడే విధంగా భూగర్భంలోనే మోటర్లను అమర్చేందుకు డిజైన్లను రూపొందించిన విషయం విధితమే. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఒక ప్రక్క టన్నెల్ పనులు చేస్తూనే మరో పక్క టన్నెల్‌కు కాంక్రిట్ నింపే పనులను కూడా వేగంగా చేస్తున్నారు. వట్టెం రిజర్వాయర్ వద్ద 8 టిఎంసిల నీటి నిల్వ ఉండే విధంగా రింగ్‌బండ్ విధానంలో రిజర్వాయర్ ని ర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక్కడ కూడా పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గత నెలరోజులుగా భూ నిర్వాసితులు ఆందోళన చేపడుతుండడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. సర్జిపూల్, పంప్‌హౌస్ ప నులు జరుగుతున్నాయి. వట్టెం నుంచి కరివేన రిజర్వాయర్ వరకు ప్ర ధాన కాలువ పనులు జరుగుతున్నాయి.

భూ సేకరణ నిర్వాసితులకు పరిహారం వంటి సమస్యలు తీరితే పనులు పురోగతి మరింత ఊపందుకుంటాయని పలువురు పేర్కోంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన నిధులతో పాటు మరో 10 వేల కోట్ల రూపాయలను కేటా యి స్తు నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతుంది అన్న దానికి ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రధానంగా మూడు లిఫ్ట్‌లు, వీటి పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన ఈ రిజర్వాయర్ పనులను త్వరీతగతిన పూర్తి చేయాలని, కృష్ణానీటిని రిజర్వాయర్‌లలోకి నింపాలన్న సంకల్పంతో ఉన్నట్లు సమాచారం. ఈ నా లుగు రిజర్వాయర్‌లు పూర్తి అయితే సుమారు 40 టిఎంసీల నీటిని ని ల్వ ఉంచవచ్చు. ఈ ప్రాజెక్టు లక్షం ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లాతో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకుసాగునీటితో పాటు తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు నీరు అందించాలన్నది లక్షం, ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి అయితే 18 లక్షల ఎకరాలకుసాగునీరు అందించడం సాధ్యమవుతుంది.

ఈ ప్రాజెక్టుకు 70 టిఎంసీల నికర జలాలు కేటాయి ంచిన విషయం విధితమే, శ్రీశైలంలో గోదావరి జలాలను మళ్ళిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మరింత విస్తరించడానికి అవకాశాలు ఉంటాయని పలువురు ఇంజనీర్లు పేర్కోంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కృష్ణానదిపై ఉన్న పెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డియే. భవిష్యత్తులో కృష్ణా జలాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుయే కీలకమని భావించిన ప్రభుత్వంపూర్తి చే యాలని సంకల్పించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నెలరోజు ల్లో ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇటివలా ముఖ్యమంత్రి ఇక పాలమూరు ను పరుగులు పెట్టిస్తామని ప్రకటిండంతో ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి అవుతాయన్న ఆశతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉన్నారు.

Palamuru Rangareddy lift irrigation project