Wednesday, March 22, 2023

చిరంజీవి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

తిరుమలాయపాలెం: మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన పల్లెల చిరంజీవి (35) అనే వ్యక్తి ఫిబ్రవరి 5వ తేదీన మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య పల్లెల జ్యోతి పోలీస్‌ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కొక్కిరేణి గ్రామానికి చెందిన యలకొండ ముత్తయ్య అనే రైతు దగ్గర పల్లెల చిరంజీవి, గోవింద వెంకన్న లు ఇరువులు పాలేరులుగా పని చేస్తున్నారు. 5వ తేదీ ఉదయం గం. 11.00ల సమయంలో పాలేరు గోవింద వెంకన్న,

పల్లెల చిరంజీవిను నీవు రైతుకు ఎక్కువ పని ఎందుకు చేస్తున్నావని నీవలన నేను కూడా చేయవల్సివస్తుందని బూతులు తిడుతూ తన భర్తను తిట్టి కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొంది.6వ తేది గం. 10.30ల సమయంలో గోవింద వెంకన్న భార్య కౌస్యలమ్మ పల్లెల చిరంజీవిని నా భర్తను ఎందుకు కొట్టావు అని బూతులు తిడుతూ కింద పడేసి కొట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మనస్థాపానికి గురైన చిరంజీవి మనో వేదన చెంది రైతు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో పక్కన పొలం వద్ద ఉన్న రైతులు గమనించి మోటార్‌ సైకిల్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News