Tuesday, July 1, 2025

పాశమైలారంలో భారీ పేలుడు… 37కు చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడ జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 37కు చేరింది. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారని, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు.
57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సింగరేణి టీమ్‌ పాల్గొందని వివరించారు. ధృవఆస్పత్రిలో 9 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని, ఇంకా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. వారు ఐసియులో చికిత్స పొందుతున్నారని వివరించారు.

ధృవ ఆస్పత్రికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. పేలుడు ధాటికి దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు భవనాలు కం పించాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘట న స్థానికంగా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. సిగాచీ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో అందులో పనిచేస్తున్న కార్మికు లు 100 మీటర్లు అవతలికి ఎగిరిపడ్డారు. దీనితోపాటు పేలుడు దాటికి రియాక్టర్ ఉన్న భవనంతో పాటు అడ్మిన్ బిల్డింగ్ సైతం పూర్తిగా ధ్వంసమైంది. మరికొన్ని భవనాలకు బీటలువారాయి. మృ తుల్లో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సైతం ఉన్న ట్టు అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News