Thursday, September 19, 2024

కుప్పకూలిన విమానం… 62 మంది సజీవదహనం (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

బ్రెజిల్: బ్రెజిల్‌లోని సావో పువాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం విన్ హెడోలో కుప్పకూలిపోవడంతో అందరూ సజీవదహనమయ్యారు. వోయుపాస్ 2283 అనే విమానం కాస్‌కవల్ నుంచి సావో పువాలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లుయూజ్ లులూ డసిల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులలో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో పెద్ద ఎత్తున మంటలతో పాటు పొగలు వ్యాపించాయి. విమానం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News