Saturday, April 27, 2024

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేసులో నేను

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తనకు హై కమాండ్ పోటీ చేయమని సూచిస్తే తప్పకుండా పోటీ చేస్తానని, తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానని డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం అన్నారు. బుధవారం కందిలోని ఎల్‌ఎన్ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు నాయుడు 2004 నుండి టిడిపి టికెట్ కేటాయిస్తానని చెప్పారని, 2014లో టిడిపి సంగారెడ్డి అసెంబ్లీ టికెట్ ఇచ్చిన అలవెన్స్‌లో బిజెపికి టికెట్ పోయిందని, కాబట్టి పోటీ చేయలేక పోయనన్నారు. 40ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో టిడిపి నుండి అంచెలు అంచెలుగా ఎదిగానన్నారు. 2016లో సిఎం కెసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరగానే సిఎం గారే నీకు రాజకీయ భవిష్యత్ ఉందని, మీరు వినియోగించుకోవాలని చెప్పారన్నారు.

అప్పటి టిడిపి హాయాంలో సిడిసి చైర్మెన్‌గా నన్ను ఎంపిక చేసింది సిఎం కెసీఆర్ అని చెప్పారు. 2001లో నేను టిఆర్‌ఎస్ పార్టీలో చేరకపోవడంతో కొంత రాజకీయంగా కొంత వెనకబడిపోయనన్నారు. అప్పుడే చేరి ఉంటే ఇప్పటి వరకు సంగారెడ్డికి 3సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం ఉండేదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించిన వారి గెలుపు కోసం కృషి చేస్తానని, సంగారెడ్డి నియోజక వర్గంలో బిఆర్‌ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. నాకు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉందని తప్పకుండా ఎమ్మెల్యే అవుతానన్నారు. ప్రజల కోసం , రైతుల కోసం కృషి చేస్తున్న తనకు సిఎం కెసీఆర్ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. డిసిసిబి సేవలు మరింత విస్తరిస్తామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News