Tuesday, September 17, 2024

ఆకట్టుకుంటున్న పవన్, ఆద్య సెల్ఫీ ఫోటో..

- Advertisement -
- Advertisement -

తన కూతురు ఆద్యతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ వేడుకలో పవన్ కూతురు ఆద్య కూడా పాల్గొంది.

ఈ సందర్భంగా స్టేజీపై కూతురుతో పవన్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “తన తండ్రి, ఏపీ డిప్యూటీ సీఎం సేవలను అర్థం చేసుకున్న ఆద్య ఆయన్ను ప్రశంసించింది. ‘నాన్నతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానని’ ఆద్య అడగ్గానే సంతోషించా” అని పేర్కొంది. కాగా.. కూతురుతో పవన్ తీసుకున్న సెల్ఫీ ఫోటో అభిమానులు ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News