Saturday, October 12, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారిని ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తన ఇద్దరు కూతుర్లు ఆద్య, పొలెనా అంజని పవనోవాలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పవన్‌ తీసుకున్నారు. వారాహి డిక్లరేషన్‌ బుక్‌ను ఆలయం వెలుపల మీడియాకు చూపించిన డిప్యూటీ సీఎం.. రేపటి వారాహి సభలో బుక్‌లోని అంశాలను తెలియజేయనున్నారు.

కాగా, నిన్న రాత్రి అలిపిరి మెట్ల మార్గాన కాలిన నడకన పవన్ తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో శ్రీవారి దర్శనానికి పవన్ కల్యాణ్ డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. అయితే, పవన్ చిన్న కుమార్తె పొలెనా అంజని.. మైనర్ అయినందున తండ్రిగా పవన్ ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News