Monday, May 19, 2025

‘రంగస్థలం’ కంటే రెట్టింపు వినోదంతో ‘పెద్ది’

- Advertisement -
- Advertisement -

ఇలాంటి మాటలు ఫ్యాన్స్ చెబుతుంటారు. నిర్మాతలు, దర్శకులు కూడా చెబుతుంటారు. కానీ ఓ హీరో ఇలాంటి స్టేట్‌మెంట్ ఇస్తే అది చాలా పెద్దది అవుతుంది. అలాంటి పెద్ద స్టేట్‌మెంట్‌ను రామ్ చరణ్ (Ram charan)ఇచ్చాడు. నేను మామూలుగా ఇలాంటివి చెప్పనని, కానీ పెద్ది సినిమాకు చెబుతున్నానని, రాసి పెట్టుకోండంటూ బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చా డు. తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లండన్ వెళ్లిన చరణ్, అక్కడ ఫ్యాన్స్‌తో సరదాగా మాట్లాడాడు. ‘పెద్ది’ అప్‌డేట్స్ బయటపెట్టాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిని మా షూటింగ్ 30 శాతం పూర్తయినట్టు తెలిపాడు. ఇదే సందర్భంగా మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించాడు. ‘రంగస్థలం’ సినిమా కంటే రెట్టింపు బెటర్‌గా ఉంటుందంట ‘పెద్ది’. ఇలా తన సినిమా గురించి చాలా గొప్పగా చెప్పకొచ్చాడు చరణ్. ‘గేమ్ చేంజర్’ కోసం చాలా టైమ్ తీసుకున్న ఈ హీరో, ‘పెద్ది’ని రికార్డ్ టైమ్‌లో ముగించాలని నిర్ణయించాడు. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News