Wednesday, December 4, 2024

‘పుష్ప2’ పీలింగ్స్‌ సాంగ్ ప్రోమో రిలీజ్‌..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప2’ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న నేపత్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ చేశారు. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ముంబైలోనూ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి పీలింగ్స్‌ అనే పాట ప్రోమోను విడుదల చేశారు. పూర్తి పాటను డిసెంబర్‌1న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో బన్నీ మాస్ స్టెప్స్ తో అలరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News