Sunday, April 28, 2024

సిఎఎపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

పౌరసత్వ సవరణ చట్టం( సిఎఎ)పై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ చట్టం దేశంలో నివసిస్తున్న ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం అసోంలోని బార్‌పేటలో అసోం గణ సంగ్రాం పరిషత్ లోక్‌సభ అభ్యర్థి ఫణి భూషణ్ చౌదరికి మద్దతుగా జరిగిన ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సిఎఎపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరి పౌరసత్వాన్ని ఇది లాక్కోదని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది పౌరసత్వాలను మాత్రమే మంజూరు చేస్తుంది’ అని ఆయన అన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠతో దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావడాన్ని ఎవరూ ఆపలేరని కూడా రాజ్‌నాథ్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News