Saturday, August 16, 2025

ఉగ్రవాదలతో లింక్.. ఎపిలో ఓ వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఉగ్రవాదుల కదలికలతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ఉలిక్కిపడింది. ఐబి అధికారులు, పోలీసులతో కలిసి ధర్మవరంలోని ఓ ఇంట్లో సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఐబి అధికారులు, పోలీసులు కోట కాలనీలో నివసించే నూర్ మహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు జరపి.. 16 సిమ్ కార్డులతో పాటు.. కొన్ని అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నూర్ మహమ్మద్ స్థానికంగా ఓ టీ స్టాల్‌లో పని చేస్తున్నట్లు గుర్తించారు. అతడు కొద్ది రోజులుగా పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో వాట్సాప్‌ కాల్స్ మాట్లాడుతున్నాట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఉగ్రవాదులతో ఛాటింగ్ కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నూర్‌ని అదుపులోకి తీసుకొని చేసి విచారిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News