Thursday, February 22, 2024

ప్రేమ విఫలం… పిజి విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

సూరత్: పిజి విద్యార్థిని ప్రేమ విఫలంకావడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో చోటుచేసుకుంది. వల్లభ విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసి సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దాడిపాడా అనే గ్రామానికి చెందిన విపుల్ వాసవ (24) గిరిజన విద్యార్థి పిజిలో కామర్స్ చదువుతోంది. తన క్లాస్‌మెట్‌తో విపుల వాసవ ప్రేమలో పడింది. ఇదరు గాఢంగా ప్రేమించుకున్నారు. అబ్బాయి కుటుంబ సభ్యులు తక్కువ కులానికి చెందిన అమ్మాయితో పెళ్లి వద్దని తిరస్కరించారు. దీంతో ప్రేమ విఫలం కావడంతో విపుల్ తన రూమ్‌లో నైలాన్ తాడుతో ఉరేసుకుంది. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సూసైడ్ లేటర్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసుల వెల్లడించారు. విపుల్ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

 

PG Student Commit Suicide with Love Failure
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News