Saturday, September 30, 2023

పిజిఇసెట్ 90.74 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిజిఇసెట్‌లో 98.74 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆగస్టు 11 నుంచి 14 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 18,274 మంది హాజరు కాగా, అందులో 18,582 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, ఒయు వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ యాదవ్, ఇసెట్ కన్వీనర్ లక్ష్మినారాయణ తదితరులు సోమవారం పిజిఇసెట్ ఫలితాలు విడుదల చేశారు. పిజిఇసెట్‌లో మహిళల ఉత్తీర్ణత 91.57 శాతంగా నమోదు కాగా, పురుషుల ఉత్తీర్ణత 89.91 శాతం నమోదైందని కన్వీనర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్, వరంగల్‌లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News