Friday, March 24, 2023

ధోతీలో ఉన్న మోడీ కేరళ సిఎం పినరయి: కాంగ్రెస్

- Advertisement -

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధోతీలో ఉన్న మోడీగా నిరూపించుకుంటున్నారని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ అభివర్ణించారు. కొచ్చిన్‌లో ఏజియానెట్ న్యూస్ చానల్ కార్యాలయంపై ఇటీవల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడి నేపథ్యంలో సతీశన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికార సిపిఎం ఎమ్మెల్యే పివి అన్వర్ చేసిన ఫిర్యాదుపై మలయాళ న్యూస్ చానల్ ఏషియానెట్‌పై పోలీసులు దాడి చేశారు. సోమవారం నాడిక్కడ సతీశన్ విలేకరులతో మాట్లాడుతూ న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలపై ప్రధాని నరేంద్ర మోడీ జరిపించిన దాడుల తరహాలోనే కేరళలో ఏషియానెట్ చానల్‌పై ముఖ్యమంత్రి విజయన్ దాడులు జరిపించారని, ధోతీలో ఉన్న మోడీగా పినరయి విజయన్ తనను తాను నిరూపించుకున్నారని సుశీలన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News