Sunday, April 28, 2024

దేశాన్ని చీల్చవద్దు: పీయూష్ గోయల్

- Advertisement -
- Advertisement -

దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది ప్రాతిపదికన చీల్చవద్దని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఒక డిఎంకె సభ్యుడు మంగళవారం హిదీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు సమర్థిస్తున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తన శాఖ అయిన వినియోగదారుల వ్యవహారాల పై అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రజలు ఎక్కడైనా సబ్సిడీ ఆహార ధాన్యాలు పొందడానికి వీలుగా ప్రధాని నరేంద్ర మోడీ ‘ ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు ఆలోచనతో ముందుకు వస్తున్నారని, దీనిద్వారా మొత్త దేశం సంఘటితమవుతుందని ఆయన చెప్పారు‘ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఒక్కటి చేయడం కోసం ఎప్పుడూ పని చేస్తారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దేశాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరయితే దక్షిణాది, ఉత్తరాది గురించి మాట్లాడుతున్నారు’ అని ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య మంత్రి అన్నారు. ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోని మంత్రి నిన్న ఈ సభలో ఒక సభ్యుడు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? ఆ సభ్యుడి ప్రకటనను ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సభ్యులు సమర్థిస్తున్నారా? అని కూడా అన్నారు. అయితే మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసిన డిఎంకె సభ్యుడు డిఎన్‌వి సెంథిల్‌కుమార్ పేరును మంత్రి ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News