Saturday, July 5, 2025

మోడీకి ట్రినిడాడ్ అత్యున్నత పురస్కారం

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్, అండ్ టొబాగో ’ ను శుక్రవారం బహుకరించారు. ఈ దేశం ఓ విదేశీ నేతకు ఈ విశిష్ట గౌరవం ఆపాదించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ కరీబియన్ దేశ పర్యటనలో ఉన్న మోడీ గౌరవార్థం ఇక్కడి ప్రెసిడెంట్ హౌస్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు అయింది. ప్రధాని మోడీ రాజనీతిజ్ఞత, ఆయన కార్యదక్షత, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతల , రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక బంధం బలోపేతం వంటి పలు అంశాల నేపథ్యంలో ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ క్రిస్టియనే కార్లా కంగలూ మోడీని ప్రశంసించారు. ప్రధాని మోడీ ఈ చిన్నదేశంలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు.

ఈ దేశ అత్యున్నత విశిష్ట పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు తాను ట్రినిడాడో టోబాగో ప్రజలకు కృతజ్ఞుడిగా ఉంటానని ప్రధాని తెలిపారు. తాను ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారతీయుల పక్షాన స్వీకరిస్తున్నానని తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే మోడీకి ఘనా దేశ విశిష్ట పురస్కారం అందింది. ఈ విధంగా ప్రధాని మోడీకి ఇప్పటివరకూ మొత్తం మీద 25 అంతర్జాతీయ స్థాయి గౌరవ పురస్కారాలు దక్కాయి. 180 సంవత్సరాల క్రితం బీహార్ ఇతర ప్రాంతాల నుంచి భారతీయులు ఈ దేశానికి వచ్చి స్థిరపడ్డారని, తరతరాలుగా ఈ దేశంతో మనకు అత్యంత పురాతన వారసత్వ బంధం ఉందని, ఇది మరింత పెనవేసుకుపోతోందని పురస్కార స్వీకరణ సభలో మోడీ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News